పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలమూరు బ్రాహ్మణవాడ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ.6,66,66,666.66 పైసలతో, అలంకారంలో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శనం కల్పించారు. అమ్మవారి ఆలయానికి ఇది మునుపెన్నడూ చూడని అలంకరణ. మహబూబ్ నగర్, అమ్మవారి భక్తులందరూ మహాలక్ష్మి దేవిని దర్శించుకుని ప్రార్థించవచ్చని తెలిపారు. అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు గుండ వెంకటేశ్వర్లు, కార్యదర్శి మిరియాల వేణుగోపాల్, కోశాధికారి తాళ్లం నాగరాజు ఆహ్వానం పలికారు.
ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహా లక్ష్మి రూపంలో 6 కోట్ల 66 లక్షల 66 వేల 666 రూపాయల 66 పైసలచే అలంకరణను తమిళనాడు నుండి వచ్చిన నిపుణులు అమ్మవారిని అలంకరించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ అన్నదానము చేస్తున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.