శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఇప్పటికే ఉగాది వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 27 నుంచి 31 వరకు శ్రీశైలం ఆలయంలో ఉగాది వేడుకలు జరుగుతాయి. ఉగాది పండుగ సమీపిస్తున్న కొద్దీ కన్నడ భక్తులు మల్లన్న ఆలయానికి భారీగా తరలివచ్చారు. అయితే, ఉగాది పండుగకు వారం ముందు నుంచే శ్రీశైలం ఆలయానికి కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు. 27 నుండి ఉగాది మహోత్సవాల సందర్భంగా 31వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీమల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడంతో ఈనెల 26 లోపే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
అయితే ఈనెల 27 నుండి 31 వరకు ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు లక్షలలో పెరగడంతో శ్రీశైలంలో కన్నడ భక్తుల రద్దీతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇబ్బందిపై సంబంధిత అధికారులు స్పందించి సిగ్నల్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని పలువురు కన్నడ భక్తులు కోరుతున్నారు.