తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు, ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది.

2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022-22లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా, 2020-21లో 4 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక 2025లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *