జైపూర్: రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో హత్య విచారణ కోసం ఎదురుచూస్తున్న 34 ఏళ్ల ఖైదీ చికెన్ గున్యాతో బాధపడుతూ పోలీసు కస్టడీలో మరణించాడని అధికారి గురువారం తెలిపారు.అయితే అతని కుటుంబసభ్యులు అతనికి విషప్రయోగం చేశారని ఆరోపిస్తూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీనిపై న్యాయ విచారణ జరుపుతున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ తెలిపారు.జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న జై సింగ్ మంగళవారం రాత్రి మృతి చెందాడు.జై సింగ్ చికెన్ గున్యాతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమించడంతో జైలు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.అతని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.కాగా, జై సింగ్కు ఆహారంలో విషం కలిపినట్లు అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జైలు వెలుపల ధర్నాకు దిగి మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.