కొలంబో: శ్రీలంకలోని నువారా-ఎలియాలోని లబుకెలెలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బస్సు ప్రమాదంలో చిక్కుకోవడంతో దాదాపు 40 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు.
బస్సు నువారా-ఎలియా నుండి తూర్పు తీరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ట్రింకోమలీకి వెళ్తోంది. పర్వత ప్రాంతంలో బస్సు వెళుతుండగా అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. గాయపడిన వారిని నువారా-ఎలియా జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 2023లో దక్షిణాసియా దేశంలో నమోదైన 2,200 ఘోర రోడ్డు ప్రమాదాల్లో 2,557 మంది మరణించినట్లు అధికారిక సమాచారం తెలియజేస్తుంది.