తాజాగా ఈ సంఘటన సత్యసాయి జిల్లా, హిందూపురం రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామదేవత పండుగ ఉండడంతో ఓ మహిళ తన సోదరి కుటుంబాన్ని ఆహ్వానించింది. చెల్లిలు గర్భిణీ కావడంతో తాను వెళ్లలేక కూతురుని భర్తతో పాటు పంపింది. శుక్రవారం ఉదయం పెదనాన్న గంగాధర్ బాలికను పెన్నా నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. నది చూడడానికి పెద్ద నాన్నతో కలిసి వెళ్లింది.

ఆ సమయంలో అప్పటికే మద్యం సేవించిన గంగాధర్, పెన్నా నది ఒడ్డున చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారిని గొంతుకోసి హత్య చేశాడు. అక్కడ పెన్నానది ఇసుక తిన్నెల్లో చిన్నారిని పాతిపెట్టి ఏమీ తెలియ‌ని వాడిలా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే బాలికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన గంగాధర్ ఒంటరిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు చిన్నారి కోసం గంగాధర్‌ను అడిగారు. అయితే స‌రైన స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి, హిందూపురం రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు గంగాధ‌ర్‌ను డీఎస్పీ కంజాక్ష‌న్ అదుపులోకి తీసుకొని విచారణ జ‌రుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *