మృత్యువు ఎక్కడనుంచి వస్తుందో పసిగట్టలేం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్‌ను టెంపో వాహనం ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, ఏఎస్‌ఐ శంకర్ తన కుమార్తె ప్రసన్నతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఇదే క్రమంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ వద్దకు రాగానే వెనుక నుంచి టెంపో వాహనం వేగంగా ఢీ కొట్టింది.
టెంపో వాహనం వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో సబ్-ఇన్‌స్పెక్టర్ శంకర్ రావుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.