ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అతికించారు.
నోటీసులు జారీ చేసి రెండు వారాలు అయినప్పటికీ, అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే నూతనకల్ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ పై లుక్అవుట్ నోటీసులను జారీ చేశారు.