హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి అద్దె చెల్లించలేదని ఓ యువతిపై ఇంటి యజమాని కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్‌నగర్‌లో చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం ఓ యువతిపై ఇంటి యజమాని కత్తితో దాడి చేయడంతో, ఆమె చేతికి, తలకి గాయాలయ్యాయి. గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు.
అసలు ఏం జరిగింది అంటే, అత్తాపూర్ హసన్ నగర్ లో ఓ ఇంటి యజమాని అద్దె చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేశాడు. అద్దెకు ఉంటున్న కుటుంబానికి, యజమానికి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన యజమాని కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు.దీంతో ఆ కుటుంబానికి చెందిన యువతికి గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబీకులు యువతిని ఆసుపత్రికి తరలించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.