శారద, కుమార్ అనే దంపతులు బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మొదటి బాలిక శాలిని సిద్దిపేట హుస్నాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఆమె బాలాజీ నగర్‌లోని తన ఇంటికి వచ్చింది. అదే ఊరిలో శివ అనే వ్యక్తి కూల్ డ్రింక్ షాపులో పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో శాలిని వేధించడం ప్రారంభించాడు.
ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించింది. గత రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.