అమెరికాలోని మిస్సిస్సిప్పిలో విషాదం చోటుచేసుకుంది. నైట్ క్లబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. యువకుల వయస్సు 19 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ కాల్పుల్లో 16 మంది గాయపడ్డారు.
కాల్పులకు గల కారణాలు తెలియలేదు. మిస్సిస్సిప్పిలోని ఇండియానోలాలోని ఓ నైట్ క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, సమీపంలో 12కి పైగా షాట్లు వినిపించాయని, బుల్లెట్లు నేరుగా తగలడంతో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
