సైబర్ నేరగాళ్లు అడిగినంత చెల్లించకపోవడంతో నగరానికి చెందిన ఓ యువకుడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. వాటిని న్యూడ్‌గా మార్చి తన స్నేహితులకు పంపాడు.

ఘట్‌కేసర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, ఘట్‌కేసర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు. అన్న(25) ఎంటెక్‌, తమ్ముడు (25) బిటెక్‌ చదువుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు తమ్ముడికి ఫోన్ చేశారు. ‘మీ అన్నయ్య మా దగ్గర అప్పు చేసాడు, తిరిగి కట్టలేదు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తాం.’ అని బెదిరించారు.

ఆ యువకుడు స్పందిస్తూ.. ‘మా అన్న తీసుకున్న అప్పు తీర్చేశాడు. ఇంకెవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేస్తావు’ అన్నాడు గట్టిగా. దీంతో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు సోషల్ యాప్స్ ఖాతాల నుంచి యువకుడి ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియా మిత్రులకు, వాట్సాప్ కాంటాక్ట్స్ కు పంపించాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *