హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డుపై తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన 23 మంది రెండు తుఫాన్ వాహనాల్లో యాదగిరిగుట్టకు వెళ్లారు. గురువారం సాయంత్రం తిరిగి వస్తూ శంషాబాద్ ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ వద్దకు వచ్చారు. వీరి వెనక డస్టర్ కారు, ఈ కారు వెనక బాలెనో కారు ఉన్నాయి. బాలెనో కారు డ్రైవర్ ఓవర్‌స్పీడ్‌తో ముందున్న రెండు వాహనాలను ఓవర్ టేక్ చేయబోయాడు. కంట్రోల్కాక ఒక్కసారిగా ఎడమ వైపు తిప్పడంతో డస్టర్కారుకు తాకింది. మల్లి కుడి వైపు తిప్పడంతో తుఫాన్ కి తగిలింది. దీనితో తుఫాన్ పల్టీలు కొట్టగా , తుఫాన్ లో ఉన్న తాజుద్దీన్ (43), వరాలు (35) రెండు నెలల బాబు చనిపోయాడు. మరో 9 మంది కూడా గాయపడడంతో అందరినీ శంషాబాద్ లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కాగా, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.