నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, దామరచర్ల మండలం బత్తులపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మహీంద్రా బొలెరో ఎస్‌యూవీని డీసీఎం ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాధితులను టాటా నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న కె యాధి (22), ఎస్‌కె రిజ్వాన్ (36)గా గుర్తించారు. ఈ ఘటనలో యాధి, రిజ్వాన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.