పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్‌లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే స్కూల్ యాజమాన్యం డ్రైవర్‌ను అక్కడినుంచి పంపించింది. విద్యార్థిని బస్సు నుంచి జారిపడి మృతిచెందిందని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, కేసును తప్పుదోవ పట్టించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతితో కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.