ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన వేపంచ షణ్ముఖ రెడ్డి (24) పీజీ చదువుతు హైదరాబాద్‌లో చేరాడు. ఇందుకోసం జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సా చేసేందుకు డబ్బులు లేకపోవడంతో బంగారం దొంగిలించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని తన స్నేహితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం తీసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని బంగారు దుకాణంలో దొంగతనం చేస్తే పడతానని భావించి అదే మోటార్‌సైకిల్‌పై హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చాడు.
నయీమ్ మియా సిద్దిపేటలోని లాల్ కమాన్ సమీపంలోని ఓ బంగారు దుకాణానికి కస్టమర్ గా వెళ్లి భారీ బంగారు గొలుసులను చూపించాలని కోరాడు. అక్కడ దుకాణదారుడు ఐదు బంగారు గొలుసులున్న ట్రే తీసుకొచ్చి అతనికి చూపించాడు గొలుసులను చూసినట్లు నటిస్తూ, షణ్ముఖ్ వారి కళ్ళు కప్పి, ట్రేతో సహా అన్ని బంగారు గొలుసులతో పారిపోయాడు. హైదరాబాద్‌లో బంగారం విక్రయిస్తే పట్టుబడతామని గ్రహించి కరీంనగర్‌లో విక్రయించాలని నిర్ణయించుకుని 21న హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. అనంతరం ప్రజ్ఞాపూర్‌కు వచ్చి పార్కింగ్‌లో బైక్ తీసుకుని కరీంనగర్ వైపు వెళ్తున్నాడు.
రంగీలా దాబా చౌరస్తాలో టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్, సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా వెళ్తున్న ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి విచారించారు. పోలీసుల విచారణలో ఐదు బంగారు గొలుసులు దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి 8 తులాల 5 బంగారు గొలుసులు, ద్విచక్ర వాహనం, స్వాధీనం చేసుకున్నారు.