సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అసిస్టెంట్ డైరెక్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. తాజాగా ఏపీలోని వైజాగ్‌కు చెందిన సిద్ధార్థ్ వర్మ(30) కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంటూ సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం పుప్పాలగూడలోని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురం యువతితో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు.
ఓ రోజు రాత్రి భోజనం పేరుతో యువతిని తన ఇంటికి రప్పించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి యువతితో తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సిద్ధార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం కేసు నమోదు చేసి సిద్ధార్థ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.