కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణమైన హత్యకు గురయ్యారు. పాత కక్షతోనే చంపేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీనివాసుల కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దుండగులు నరికి హతమార్చారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ చెప్పారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున కీలకంగా పని చేశారనే కక్షతోనే శ్రీనివాసులను హత్య చేశారని ఆరోపించారు. హత్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
వైసీపీ మూకల దాడిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.