జగిత్యాల: మేడిపల్లి మండలం తొంబరావుపేటలో సోమవారం తెల్లవారుజామున గల్ఫ్‌కు నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఉపాధి వెతుక్కుంటూ బహ్రెయిన్ వెళ్లిన రాయంచు లింగయ్య ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న భార్య జలజ(44)పై పారతో దాడి చేసి హత్య చేశాడు.అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేలోపు పురుగుమందు తాగాడని, అక్కడికి చేరుకోగానే స్పృహతప్పి పడిపోయాడని చెబుతున్నారు. పోలీసులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో లింగయ్య హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు గల్ఫ్‌లో ఉంటుండగా, కూతురికి పెళ్లి చేశారు.