New Rules for H1B Visa

New Rules for H1B Visa: అమెరికా కార్మిక శాఖ ట్రంప్ ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. హెచ్-1బీ వంటి వీసాలపై పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాలను భారీగా పెంచాలని సూచించింది. ఈ మార్పులతో అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం సుమారు 14,000 డాలర్లు (దాదాపు రూ. 11.7 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఉన్న పాత వేతన విధానాన్ని మార్చి, విదేశీయులు మరియు అమెరికన్ల మధ్య ఉన్న జీతాల తేడాను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుత నాలుగు వేతన స్థాయిలలో కనీస పరిమితులను పెంచనున్నారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వేతనం 17 శాతం నుంచి 34 శాతానికి పెరుగుతుంది. అంటే, ముందు 100 మందిలో 17వ వ్యక్తి తీసుకునే జీతం ఆధారంగా విదేశీయులను నియమించేవారు, ఇప్పుడు 34వ వ్యక్తి జీతాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. అలాగే, అత్యున్నత స్థాయి ఉద్యోగుల వేతన పరిమితి 67 శాతం నుంచి 88 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

హెచ్-1బీ వీసాలకు కొత్త రూల్స్.. కనీస వేతనం 14 వేల డాలర్లు పెంచే యోచన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *