Donald Trump

పశ్చిమాసియాలో పరిస్థితులను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ సంక్షోభం వైపు నడిపిస్తున్నారంటూ అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మండిపడ్డారు. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తుంటే, కాలిఫోర్నియాలోని బీచ్‌లో బిడెన్ నిద్రిస్తున్నాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలకు ప్రయత్నించకుండా కమలా హారిస్ బస్సులో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

కాగా, మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించడం ఇది 32వ సారి. 2013 నుండి, అతను చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే డెమోక్రాట్ల తరపున కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆమెపై విమర్శలు ఎక్కువయ్యాయి. కమల నాయకత్వంలో అమెరికాకు భవిష్యత్తు అనేదే ఉండదని తాజాగా ఆరోపించారు. వారందరినీ ఆమె అణుయుద్ధం వైపు తీసుకెళుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *