ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8 లాంచింగ్ డేట్ రాణే వచ్చింది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ తో రాబోతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోని కూడా విడుదల చేయగా తాజాగా బిగ్ బాస్ మొదలయ్యే డేట్ ని ప్రకటిస్తూ మరో ప్రోమోని మేకర్స్ విడుదల చేసారు.బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలు కానుంది. సెప్టెంబర్ 1న ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఆ రోజే హౌస్ లోకి ఎవరెవరు కంటెంటెంట్స్ వెళ్తారో తెలుస్తుంది. ఆ తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే, ఈసారి ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారనే విషయంపై క్లారిటీ లేదు. 14 లేదా 18 మంది వరకు ఈ షోలో పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఓ సెలబ్రిటీ కపుల్, నటి రేఖ భోజ్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు వెళ్తారో చూడాలి. బిగ్ బాస్ అభిమానులు, కంటెస్టెంట్స్ ఎవరు వచ్చిన సరే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని కామెంట్లు పెడ్తున్నారు.