News5am,Breaking Telugu New (05-05-2025): భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. పీవోకేలో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ మెరుపు దాడులతో ధ్వంసం చేసింది. ఈ చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ భావోద్వేగంగా స్పందిస్తున్నారు. వారిలో ఎవరు ఏమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

JR. NTR : మన భారత సైన్యం యొక్క భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జై హింద్

పవన్ కళ్యాణ్ : దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ గారికి కృతజ్ఞతలు… మీ వెన్నంటే మేము. జైహింద్!

రజనీకాంత్ : యోధల పోరాటం ప్రారంభమయింది.. మిషన్ పూర్తయ్యే వరకు ఈ పోరాటం ఆగదు! మొత్తం దేశం మీతో ఉంది.

కళ్యాణ్ రామ్ : మన రక్షణ దళాలకు మరింత బలం మరియు శక్తి ఇద్దాం. ఆపరేషన్ సిందూర్ పిరికి పహల్గామ్ టెర్రర్ దాడులకు బలమైన సమాధానం. గౌరవించండి. సంకల్పించండి. జ్ఞాపకం చేసుకోండి.

అల్లు అర్జున్ : ఆపరేషన్ సింధూర్ తో న్యాయం గెలవాలి. జై హింద్

మెగాస్టార్ : ఆపరేషన్ సింధూర్ స్టార్ట్.. జై హింద్

వరుణ్ తేజ్ : ఉగ్రవాదాన్ని క్షమించేది లేదు.

విశ్వక్ సేన్ : “కొన్నిసార్లు కష్టతరమైన మిషన్లు క్లోజ్ డోర్స్ వెనుక జరుగుతాయి. షార్ప్ గా ఉండండి, ఫోకస్ గా ఉండండి. ప్రతి కదలిక ముఖ్యం. జై హింద్

ఇంద్ర రామ్ : భారత ఆర్మీకి సెల్యూట్.. జై హింద్

More Breaking Telugu News

రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు…

నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…

More Breaking Telugu New: External Sources

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యానికి అండగా నిలిచిన టాలీవుడ్ నటులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *