మెగాస్టార్ చిరంజీవి మరో అత్యున్నత అవార్డును గెలుచుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ యూకే పార్లమెంటులో బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.
పార్లమెంటు సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మన్, తదితరులు పాల్గొన్నారు. వారి చేతులమీదుగా చిరు పురస్కారం అందుకున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వీటిపై మెగా అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.