మెగా పవర్ రామ్ చరణ్ కు గత సంవత్సరం కాస్త చేదు తీపిని మిగిల్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ మెగా అభిమానులను నిరాశపరిచింది. ఈసారి, రామ్ చరణ్ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు యంగ్ బుచ్చిబాబుతో తన తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఉత్తరాంధ్రలో క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబరులో కర్ణాటకలోని మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చిన యూనిట్ మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తుంది. తర్వాతి షెడ్యూల్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది RC 16 టీమ్. అక్కడ కొన్ని కీలకమైన సీన్స్ ను తీయబోతున్నారు. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు ఇప్పటికే మూడు సాంగ్స్ ఇచ్చారట. విన్న వాళ్ళు సూపర్బ్ అంటున్నారట. మొదటి సినిమాకి సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయో, ఇప్పుడు సినిమాకి కూడా మ్యూజిక్ బిగ్ ప్లస్ అవ్వబోతుందని టాక్. ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ 16 టైటిల్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *