యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకు ఆయన సంగీతంలో విడుదలైన పాటలన్నీ మెగా హిట్ పాటలే. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవల దళపతి విజయ్ నటించిన ‘గట్టు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఇళయరాజా తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన, తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్‌లో టాప్ కంపోజర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించారు. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ స్థాయిలో మెప్పించిన ఆయన ఇప్పుడు కొత్త అవతారం తీసుకోబోతున్నారు. త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. తన సన్నిహితుడు శింబును హీరోగా పెట్టి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ సంగీతంపైనే కాకుండా కథలపైన వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే శింబు హీరోగా పెట్టి ఒక సినిమాను చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు. శింబుకు ఇప్పటివరకు చెప్పలేదని యువన్ అన్నారు. అయితే యువన్ శంకర్ రాజా తో శింబుకు చాలా మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన, ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సోషల్ మీడియాలో వీరి కాంబో మూవీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.