మనీలాండరింగ్ కేసులో ప్రముఖ నటి తమన్నా భాటియా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచార‌ణ‌కు హాజరయ్యారు. బిట్‌కాయిన్లు, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీల మైనింగ్ పేరిట ప‌లువురిని మోసం చేసిన వ్య‌వ‌హారంలో హెచ్‌పీజ‌డ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది.

ఈ కేసులో వెలుగులోకి వ‌చ్చిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌న్నా వాంగూల్మం న‌మోదు చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. యాప్ కంపెనీ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు త‌మ‌న్నా కొంత న‌గ‌దు తీసుకున్నారు. అయితే ఆమెపై ఎలాంటి నేరారోప‌ణ అభియోగాలు మోప‌లేద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *