kishkindhapuri trailer released: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కింధపురి హారర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. చావు కబురు చల్లగా చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో మసక చీకటి, ఒంటరి అడవి, వింతగా నడుస్తున్న వ్యక్తి, భయానక డైలాగ్‌లు సస్పెన్స్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘సువర్ణ మాయ’ దెయ్యాల భవంతి కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్కడికి వెళ్లినవారు ఎదుర్కొన్న అనుభవాలు, ఆ దెయ్యం వెనుక కథేంటన్నది కథలో ప్రధానాంశం.
ట్రైలర్‌లో అనుపమ దెయ్యంగా మారడం, బెల్లంకొండ శక్తివంతమైన పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ కూడా భయపెట్టేలా ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మించారు. రాక్షసుడు వంటి క్రైమ్ థ్రిల్లర్‌తో హిట్ అందుకున్న ఈ జంట, ఇప్పుడు హారర్ మిస్టరీ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.
Internal Links:
ఓటీటీకి వచ్చేసిన తమిళ హారర్ థ్రిల్లర్..
నానమ్మ మృతిపై ఐకాన్ స్టార్ భావోద్వేగం..
External Links:
వణుకు పుట్టిస్తున్న‘కిష్కిందపురి’ ట్రైలర్.. దెయ్యమై భయపెడుతున్న అనుపమ