News5am, Latest Breaking News Updates (02-06-2025): పవన్ కల్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత జూన్ 12న సినిమాను విడుదల చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు ప్రమోషన్లు మొదలవ్వలేదు. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. విడుదలకు ఇంకా పది రోజులు మాత్రమే ఉండగా, ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాత ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ , సెకండ్ హాఫ్‌లో సీజీ వర్క్ ఎక్కువగా పెండింగ్‌లో ఉందని, పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అవి పూర్తయిన వెంటనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అందుకే సినిమాకు జూన్ 12న విడుదల తేదీని నిర్ణయించామని చెప్పారు.
ఇక పవన్ కల్యాణ్ కూడా ప్రమోషన్ల కోసం డేట్స్ కేటాయించినట్లు సమాచారం. రెండు ముఖ్యమైన ఇంటర్వ్యూలు, మూడు పెద్ద ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవెంట్లు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
More Latest Breaking News Movies:
Latest Breaking News Updates
చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..
‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
More Latest Breaking: External Sources
‘వీరమల్లు’ ట్రైలర్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..