దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి, కడలి, చెలియా, నవాబ్, లాంటి సినిమాలతో మళ్ళీ వెనక్కి పడిపోయాడు మణి. దీంతో ఈ సారి బారి ప్లాన్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ తీసి తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.

దానికి సమయం పటేలా ఉండటంతో, న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట మణి . అది కూడా ఒక కొత్త యంగ్ హీరో అండ్ హీరోయిన్ తో, అంతేకాదు అతి తక్కువ బడ్జెట్‌లో వేగంగా పూర్తయ్యేలా ఈ లవ్ ఎంటర్టైనర్ ఉంటుందని చెన్నై టాక్. త్వరలో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. మణిరత్నం సినిమాలో రొమాన్స్ అంటే ఒకప్పుడు తెరమీద కవిత చదువుతున్న భావన కలిగేది. మరి ఈ వయసులో కూడా అదే ఇంపాక్ట్ ఇచ్చేలా కథ తీసుకుంటారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *