మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
సినిమా ప్లాప్ అయింది ఇక నుండి తన సినిమాలో బూతులు ఉండవ్ అని చిత్ర హీరో విశ్వక్ సైతం ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. థియేటర్స్ లో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన లైలా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. అయితే ఈ కళాకండాన్ని ఇప్పుడు రెండు ఓటీటీలు స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నాయి. ఈ నెల 7 నుండి లైలాను అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అసభ్యకరమైన సీన్స్ లేకుండా ఈ స్ట్రీమింగ్ చేస్తారా లేదా థియేటర్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.