లావణ్య-రాజ్ తరుణ్ కేసు హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఈ సమయంలో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగానే పోలీసులు రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయంలో రాజ్ తరుణ్ కోర్టు కి రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ రాజ్ తరుణ్ కి కోర్టు కు వచ్చే సమయం లేదు అని లాయర్ ద్వారా కోర్టుకు చెప్పాడు.
ఇప్పుడు చాల మంది కోర్టుకు కి రాలేని వాడు సినిమా ప్రమోషన్లకు వస్తాడా అని గుసగుసలాడుతున్నారు. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు మరియు తిరగబడరా సామి రెండు విడుదల కాబోతున్నాయి. ఈ విధంగా రాజ్ తరుణ్ మీడియా ముందుకు వస్తాడా.. కోర్టుకు రాలేని వాడు.. ప్రమోషన్లకు వస్తాడా.. అని చాల మంది మాట్లాడుకుంటున్నారు.