వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ తో మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నారు మరియు వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. అనితా హసనందిని, అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *