Suriya Movie: తమిళ హీరో సూర్య ఇటీవల వరుస ప్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సూర్య 45వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమా ద్వారా తప్పకుండా హిట్ కొట్టాలన్న నమ్మకంతో సూర్య ఉన్నాడు. అలాగే తన అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇవ్వాలని దర్శకుడు ఆర్జే బాలాజీ జూలై 23న టీజర్ విడుదలకు సిద్ధమవుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను థింక్ మ్యూజిక్ సంస్థ భారీ మొత్తానికి తీసుకుంది. ఈ బర్త్ డే నాటికి సూర్య 50 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నాడు. కథానాయికగా త్రిష నటించనుందని వార్తలు ఉన్నా, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అదే రోజు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న మరో సినిమాకు కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
Internal Links:
అంచనాలను దాటేసిన ‘పెద్ది’ బడ్జెట్..
కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు..
External Links:
సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్