News5am, Telugu News Latest (04-06-2025): ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన ప్రియమణి, ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ అని తేడా లేకుండా ఆమెకు నచ్చిన కథలతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నటిస్తోంది. ఇటీవల ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆమె ‘గుడ్ వైఫ్’ అనే మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అమెరికన్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ ఆధారంగా తీసినట్టు సమాచారం.
ఈ కథలో ఒక లాయర్ తన భర్తను సెక్స్ కుంభకోణం నుంచి బయట పడేయడానికి చేసే ప్రయాసలు, వాటిలోని థ్రిల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ చూపిస్తారు. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో ప్రియమణి లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణ భారత భాషల్లో రిలీజ్ చేస్తారు. కానీ ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
More Telugu News Latest Movies:
News Latest:
‘వీరమల్లు’ ట్రైలర్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
‘కింగ్డమ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
More News Latest: External Sources
ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..