వరుణ్ సందేశ్ తన కెరీర్ ప్రారంభంలో హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తాజాగా ‘విరాజి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన విరాజి రెండు డిఫరెంట్ లుక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త పర్వాలేదనిపించాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ (Aha)లో ఈ నెల (ఆగస్ట్ 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘చుట్టూ పిచ్చి ప్రపంచం. బయటపడతాడా? భయపెడతాడా?’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది ఆహా. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ప్రమోదిని, రఘు కారు మంచి ప్రధాన పాత్రలు పోషించారు.