బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం యూట్యూబర్‌లకే కాదు, సినీ తారల మెడకు కూడా చుట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత తదితరులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్ కే ప్రమోట్ చేశారని టీమ్ స్పష్టం చేసింది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారని పేర్కొంది.
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో తన ఒప్పందం గత సంవత్సరం ముగిసిందని టీమ్ స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఏ23సంస్థతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.