Breaking Telugu News

News5am,Breaking Telugu New (9-05-2025): పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో నమోదైన ప్రతి ఆఫీసర్‌ను, సిబ్బందిని సైన్యానికి మద్దతుగా విధుల్లో పాల్గొనాల్సిందిగా సిద్ధం చేసింది. శుక్రవారం ఢిల్లీలో సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి పంపించాలని ఆర్మీ చీఫ్‌కు రక్షణ మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను తక్షణమే విధుల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అనేది యుద్ధ సమయాల్లో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దతు ఇచ్చే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన రిజర్వ్ మిలిటరీ దళం. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొంటారు.

More Breaking Telugu News

ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు..

నూతన పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్…

More Breaking Telugu New: External Sources

India-Pak Tensions: ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *