నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పడంతో 11 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్యాటక బస్సు ఫోకరా నుంచి ఖాట్మండుకు 40 మంది యాత్రికులతో వెళ్తుంది బస్సు అదుపుతప్పి నేపాల్ దేశం తానాహున్ జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మంది యాత్రికులు మృతి చెందినట్లు, పలువురు గల్లంతయ్యారు అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
‘భారత్‌కు చెందిన యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) నెంబర్‌గల బస్సు గా అధికారులు గుర్తించారు. బస్సు జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలోకి దూసుకుపోయింది. అనంతరం నది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. పలువురు తప్పించుకునే ప్రయత్నంలో నదిలో కొట్టుకునిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు ’ అని నేపాల్‌లోని తానాహున్ జిల్లాకు చెందిన డీఎస్పీ దీప్‌కుమార్ రాయ తెలిపారు.