Radhakrishnan elected as vice president: ఎన్డీయే అభ్యర్థి సీపీ. రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పార్లమెంట్ భవనంలోని వసుధ కాంప్లెక్స్ రూమ్ 101లో సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 781 మంది ఎంపీలలో 767 మంది ఓటు హక్కు వినియోగించగా, 15 ఓట్లు చెల్లని వాటిగా తేలాయి. దీంతో 752 బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకున్నారు. 98.20 శాతం పోలింగ్ నమోదైంది. విజయానికి అవసరమైన 377 ఓట్లకంటే ఎక్కువగా, రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఫలితాలను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ. మోదీ ప్రకటించారు. ఈ విజయంతో రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తిగా నిలిచారు. ఆయన ఎన్నిక సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తదితరులు అభినందనలు తెలిపారు.
Internal Links:
కర్ణాటకలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు..
External Links:
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్పై గెలుపు