హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నేత శ్రీ గణేష్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్, మంత్రి శ్రీ గణేష్‌ను అభినందించారు.రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 13,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.