నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదచేస్తామన్నారు. ఈరోజు (సెప్టెంబర్ 25) హైదరాబాద్‌లో జరిగిన BFSI నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులకు అన్యాయం జరిగి, విద్యార్థులంతా రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు. నిరుద్యోగం తీవ్రతను గ్రహించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వెబ్‌సైట్‌లో 30 లక్షల మంది నిరుద్యోగుల పేర్లు నమోదు కాగా, రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలను భర్తీ చేసి ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత తమదేనని ప్రకటించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు లేక ఒత్తిళ్ల కారణంగా యువత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *