నిత్యం వివాదాల్లో ఉండే జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చర్లపల్లి జైలులో ఓ రాత్రి గడిపిన అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా ముఖ్యమంత్రులు అవుతున్నారని కాబట్టి భవిష్యత్తులో అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని అన్నారు.
జైలుకు వెళ్లిన జగన్ సీఎం అయినట్లే బన్నీ కూడా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. జైలు నుంచి జగన్ ఎంతో కసిగా బయటకు వచ్చారని దానికంటే 100 రెట్లు ఫైర్ తో అల్లు అర్జున్ బయటకు వచ్చారని అన్నారు. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.