Minister Ponnam Prabhakar

News5am, Breaking News Telugu News (05/05/2025) : మినిస్టర్ క్వార్టర్స్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. వారు ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈ రోజు లేదా రేపు ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం – ఈ మూడింటికీ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఆర్టీసీ కోలుకుంటోందని, సమస్యలు తొలుగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దూరంగా ఉండాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయక, ఒక్క ఉద్యోగినీ నియమించక, సీసీఎస్‌, పీఎఫ్‌ డబ్బులను వినియోగించారని విమర్శించారు.

ఆర్టీసీ పునరుద్ధరణలో భాగంగా 16 నెలలుగా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు బాండ్ల రూపంలో రూ.400 కోట్లు చెల్లించామని, 2017 పే స్కేల్‌లో 21 శాతం పెంపు కల్పించామని, దీని వలన సంవత్సరానికి రూ.412 కోట్లు భారం పడుతోందన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ ఆర్గనైజేషన్‌కు రూ.1039 కోట్లు, నెలవారీ పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను జనవరి 2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే సీసీఎస్ బకాయిలుగా రూ.345 కోట్లు చెల్లించామని, నెలవారీ సీసీఎస్ కంట్రిబ్యూషన్ కూడా జనవరి 2024 నుంచి చెల్లిస్తున్నట్టు చెప్పారు. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినట్టు, 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కొత్త బస్సులు కొనుగోలు చేసినట్టు, తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చామని వివరించారు.

More News: Breaking News Telugu:

నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…

జానులిరితో ప్రేమను ఒప్పుకున్న దిలీప్..

More Breaking Big News: External Sources

Ponnam Prabhakar: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *