నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్‌లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. హిట్ 3 ఇది సరిపోదు. రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే రైతు మహోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు. నిజాం సాగర్ మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుండి బురద తొలగింపుకు త్వరలో టెండర్లు పిలుస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే, బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ రైతులపై నిందలు వేస్తూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు.

అయితే, నిజామాబాద్ జిల్లాలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. 10 ఏళ్ళల్లో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్, కేసీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయింది. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *