దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన ‘ఛావా’ చిత్రం మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం హిందీతో సహా పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నట్లు సమాచారం.

గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కారణంగానే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఇటీవల ఆందోళనలు జరిగాయని, నాగ్ పూర్ లో హింస చెలరేగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైనటువంటి సినిమాను పార్లమెంటులో ప్రదర్శించడమేంటని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఛావా’ సినిమా ప్రదర్శనను ప్రతిపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *