సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయించింది. ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తుకంటే లిఫ్ట్ కిందికి దిగింది.
దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం సీఎంను అధికారులు వేరే లిఫ్ట్ లో పంపారు.