తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించేందుకు ఆయన ప్రధానంగా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంకా ఆరు కేబినెట్ పదవులు ఖాళీగా ఉన్నాయని, దీనిపై సమీక్షిస్తామన్నారు. ఇంకా రాష్ట్రంలోని చాలా జిల్లాలకు మంత్రులు లేరు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్‌కు సూచించనున్నారు. ఇప్పటికే జాబితా ఖరారైనప్పటికీ, దానికి అనుమతులు వచ్చేలా టూర్ కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రేవంతరెడ్డి సచివాలయంలో నేటి నుంచి ప్రతి శాఖకు సంబంధించి సమీక్షలు చేపడుతున్నారు.