ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార వ్యాధితో ఇప్పటికే ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. మరికొందరు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుర్ల గ్రామంలో సార బాధితలను పరామర్శించనున్నారు. నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని SSRపేట రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించనున్నారు.
అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై పవన్ కల్యాణ్ నేడు అధికారులతో సమీక్షించనున్నారు. వారితో మాట్లాడి వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేయనున్నారు.