ధాన్యం కొలతల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు అని ట్వీట్ చేశారు. పెళ్లిళ్లకు సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీక మాసం వచ్చింది కానీ ధ్యానం కొనుగోళ్లు అందుబాటులో లేవు. నాడు గింజగింజకు కేసీఆర్ ఇచ్చిన హామీ – నేడు గడియగడియ గండమే, ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
మిల్లర్లతో చర్చలు లేవు – రైతుకు భరోసా కరువు- అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ధాన్యం కొంటే 500 బోనస్ – అసలు కొనకుంటే అంతా బోగస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమీక్ష లేదు – సమావేశం లేదు – ధాన్యం పై కప్పే కవర్లు లేవు – అసలు సమయమే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ లేదు – రైతు బంధు లేదు – రైతు భీమా లేదు – చివరకు పంట కొనుగోళ్లు లేవన్నారు. లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమిలేవు అని ట్విటర్ వేదికగా కేటీఆర్ సంచనల వ్యాఖ్యలు చేశారు.